BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు

Select Suryaa Now
ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి జిల్లాలో పురపొరుతో పాటు పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ప్రజల్లో భద్రతా భావాన్ని నింపేందుకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు నేతృత్వంలో భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్ దగ్గర నుంచి డియర్ మహాల్ రోడ్డు లోని షోరూం, లక్ష్మీపురం సర్కిల్ మీదుగా పోస్టల్ కాలనీ వరకు పోలీస్ బలగాలు కవాతు చేస్తుంటే, స్థానికంగా ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్ల గుండెల్లో రైళ్లు ప్రయత్నించారు. ఈ ఫ్లాగ్ మార్చలో జిల్లా ఎస్పీ నేరుగా పాల్గొని లాటి చేత పట్టుకుని ఖబడ్దార్ అంటూ బలగాలతో కవాతు చేశారు.

-జిల్లా ఎస్పీ సూటిగా హెచ్చరిక 

-ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిందే. ఎవడైనా పోలింగ్ కేంద్రాల దగ్గర 100, 200 మీటర్ల నిబంధనలు అతిక్రమిస్తే, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే, ప్రలోభాలకు గురిచేస్తే - చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉపేక్షించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు.

-ఎస్పీ మాస్టర్ ప్లాన్ ఇదే

మున్సిపల్ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు ఒకేసారి పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో బలగాలను ఎక్కడికక్కడ తరలించేలా పక్కా బందోబస్తుకు రంగం సిద్ధం చేశారు. ఏపీఎస్పీ తోపాటు జిల్లా బలగాలు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు.సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ నిఘా పెట్టారు. రౌడీ షీట్లు, పాత నేరస్తుల కదలికలపై కన్ను వేశారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు - ఎక్కడ ఘటన జరిగినా నిమిషాల్లో స్పాట్ వెళ్లే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించారు.ప్రజలు ధైర్యంగా, ఎలాంటి భయం లేకుండా ఓటేయండి. మీ భద్రతకు మేమున్నాం. ఎవడైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి అంటూ ఓటర్లకు ఎస్పీ భరోసా ఇచ్చారు.ఈ భారీ ఫ్లాగ్ మార్చ్ లో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహర్ ఆచారి, శ్రీనివాసరావు, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ పాల్గొని తిరుపతి పోలీస్ సత్తా ఏంటో ఫ్లాగ్ మార్చ్ తో చూపించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్