BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!*

Select Suryaa Now
చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!*

 

*700కు పైగా యూనిట్ల ఏర్పాటుకు శిక్షణ.. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం*

*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* సంప్రదాయ చెక్కగానుగ నూనెల తయారీని ప్రోత్సహిస్తూ స్వదేశీ ఉత్పత్తుల విస్తరణకు కృషి చేస్తున్న బస్వరాజు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఖాదర్‌వలి శిష్యుడైన ఆయన 2016లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో ఎదురైన ఓ అనుభవం నేపథ్యంలో సహజసిద్ధమైన నూనెల తయారీపై దృష్టి సారించారు. నిత్యావసరమైన వంటనూనెల తయారీ విధానాలపై పరిశోధించి, ఎద్దుల గానుగతో తయారుచేసే సంప్రదాయ నూనెల ప్రాధాన్యాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఈ క్రమంలో పలువురికి శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా 700కు పైగా చెక్కగానుగ యూనిట్ల ఏర్పాటుకు తోడ్పడ్డారు.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని స్వదేశీ ఉత్పత్తుల కేంద్రాన్ని ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ గుండెబోయిన రమేష్‌ యాదవ్‌ సందర్శించి బస్వరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. చెక్కగానుగ యూనిట్ల విస్తరణ, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
*సంప్రదాయ పద్ధతులే ఆరోగ్యానికి మేలు*
ఈ సందర్భంగా బస్వరాజు మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే నూనెలపై ప్రజల్లో అవగాహన పెంచడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు. యువతకు శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెక్కగానుగ యూనిట్లను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.కార్యక్రమంలో రంగారాజు లక్ష్మినర్సింహా రావు పాల్గొన్నారు.