BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ*

Select Suryaa Now
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి*  *ఏఐటీయూసీ*

 

*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*

*మధ్యాహ్న భోజన పథకంలో సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే పాఠశాలల్లో వంటలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 బుధవారం ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు  కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి వెళ్లగా అక్కడ ఎమ్మెల్యే మరియు పిఏ   అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ కు వినతి పత్రం సమర్పించి నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ ఇమ్రాన్ మాట్లాడుతూ 2023–24 సంవత్సరాలకు సంబంధించిన 9 నెలల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని,  పెండింగ్ బిల్లులను జిల్లాల వారీగా విడుదల చేయడంతో పాటు, వంట కార్మికులకు ఎన్నికల సందర్భంగా  ప్రకటించిన రూ.10,000 గౌరవ వేతనాన్ని అమలు చేయాలని, వంట కార్మికులకు కోడి గుడ్లు, గ్యాస్, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, అలాగే వంట కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గతంలో అల్లాహారం చేసిన బిల్లులు, పారితోషిక బకాయిలను చెల్లించాలని, ప్రధాన బీమా పథకాన్ని అమలు చేయాలని, కార్మికులను రాజకీయ కారణాలతో తొలగించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి మెస్ ఛార్జీ రూ.25 చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజనం పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సామల పద్మ, మహేశ్వరి, అరుణ, లలిత,  నిర్మల, వీరస్వామి, పుష్ప, అండాలు పాల్గొన్నారు*