మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా
మునగాల, మేజర్ న్యూస్ : మద్యం సేవించి వాహనం నడిపిన 8 మందికి కోర్టు జరిమానా విధించగా, ఇద్దరికి జైలు శిక్ష కూడా విధించినట్లు ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు.ఈ నెల 27న మునగాల మండలం తాడువాయి స్టేజి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 8 మంది వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.వారిని అదుపులోకి తీసుకుని బుధవారం కోదాడ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఇద్దరికి రూ.2 వేల జరిమానాతో పాటు ఒకరోజు జైలు శిక్ష, మిగతా ఆరుగురికి రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ ఎం.డి. ఉమర్ తీర్పు ఇచ్చారని ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి హెచ్చరించారు.