BREAKING
అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ నేడు ఆర్టీసీ డయల్ యువర్ డిఎం ఫొటో ఓటర్ స్లిప్పు తప్పనిసరి కాదు.. : కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టీకరణ దామెర పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిన ఘ‌న నివాళి మహర్షి వాల్మీకి ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం -- డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్ డిజిపి కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించిన : డిజి లా & ఆర్డర్ మహేష్ భగవత్ సెల్ఫోన్ సంకేతాలు లేక అవస్థలు!

ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్

Select Suryaa Now
ఓటర్ల సవరణ ఆర్డర్లపై సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్

సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను భారత ఎన్నికల సంఘం (ECI) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి జారీ చేసిన మూడు కీలక ఎస్ఐఆర్ ఉత్తర్వులూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల సంపూర్ణ ఏకగ్రీవ ఆమోదంతోనే వెలువడ్డాయని స్పష్టం చేసింది. కమిషన్ రాజ్యాంగబద్ధ పనితీరుపై నిరాధారమైన ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.

ఫామ్ 6 సవరించలేదని స్పష్టీకరణ:
సుప్రీంకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో ఎన్నికల సంఘం పలు అంశాలను పొందుపరిచింది. ఎస్ఐఆర్ ఉత్తర్వులన్నీ ఈసీ సభ్యులందరి పూర్తి ఏకాభిప్రాయంతోనే జారీ అయ్యాయని, అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఉన్నాయన్న వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. ఎస్ఐఆర్ ఉత్తర్వుల ద్వారా ఓటర్ల నమోదు నిబంధనలు 1960 లోని ఫామ్ 6ను సవరించారన్న ఆరోపణలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఫామ్ 6ను సవరించగలదని, ఎస్ఐఆర్ డిక్లరేషన్ అనేది ఒక ప్రత్యేక పత్రం మాత్రమేనని వివరించింది.

ఈసీఐనెట్ భద్రత మరియు ఓటర్ల రక్షణ:
ఓటర్ల నమోదు అధికారి (ERO) ఇచ్చిన చట్టబద్ధమైన ఆదేశం లేకుండా ఈసీఐనెట్ ప్లాట్‌ఫారమ్ నుంచి ఏ ఒక్క ఓటరు పేరునూ చేర్చడం లేదా తొలగించడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియల భద్రత, పారదర్శకతను పరిశీలించేందుకు ఐఐటీలు, ఐఐఎస్సీ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీ పనిచేస్తోందని వెల్లడించింది. ఇంకా మ్యాపింగ్ పూర్తికాని ఓటర్లు విచారణలకు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, బూత్ స్థాయి అధికారులు (BLO) నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పత్రాలను సేకరిస్తారని పేర్కొంది.

ప్రక్రియ పారదర్శకం – పిటిషన్లు కొట్టివేయాలని వినతి:
కేవలం వార్తా కథనాల ఆధారంగా ఎన్నికల సంఘంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వార్తా కథనాలు చట్టం దృష్టిలో సాక్ష్యాలు కావని ఈసీ కోర్టుకు నివేదించింది. చట్టపరమైన నిబంధనల ప్రకారమే ప్రతి నిర్ణయం అమలవుతోందని వివరిస్తూ సంబంధిత పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.