BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

మహర్షి వాల్మీకి ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం -- డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్

Select Suryaa Now
మహర్షి వాల్మీకి ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం -- డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్

నారాయణపేట, సూర్యన్యూస్: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో డీసీఆర్‌బీ డీఎస్పీ ఏ. మహేష్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్ మాట్లాడుతూ... మహర్షి వాల్మీకి సంస్కృతంలో ఆదికావ్యమైన రామాయణాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పారని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవిత విశేషాల ద్వారా సమాజానికి నైతిక విలువలు, ఆదర్శవంతమైన జీవన విధానం, కర్తవ్యనిష్ఠ వంటి గొప్ప సందేశాలను అందించారని తెలిపారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన బోధించిన విలువలను ఆచరణలో పెట్టి సమానత్వం, సోదరభావం, సామాజిక సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల జయంతులను జరుపుకోవడం ద్వారా వారి ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు వారి సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్ముడు రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.