BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి

Select Suryaa Now
ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి

నందిగామ‌, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ సూచించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం జగ్గయ్యపేట, నందిగామ పట్టణ స్థానిక సంస్థల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, వాటి పనితీరును పరిశీలించారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అరికట్టేందుకు నగదు, మద్యం, కానుకలు తదితర ప్రలోభాలకు సంబంధించిన వస్తువుల అక్రమ రవాణాపై నిఘా పెంచాలని, తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. చేపట్టిన తనిఖీల వివరాలను నిర్ణీత రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. అనంతరం నందిగామ, జగ్గయ్యపేట పట్టణ స్థానిక సంస్థల సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరి ఎన్నికల వ్యయ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఏపీఎస్ఈసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. వ్యయ వివరాలను నిర్ణీత నమూనాల్లో, నిర్దేశించిన గడువులోగా నమోదు చేయడంతో పాటు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన పక్షంలో తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేలా చూడ‌టంలో ఎన్నిక‌ల వ్య‌య ప‌ర్య‌వేక్ష‌ణ అత్యంత కీల‌క‌మ‌ని.. ఆ బాధ్య‌త‌ను అన్ని బృందాలు స‌మ‌న్వ‌యంతో నిబ‌ద్ధ‌త‌తో నిర్వ‌ర్తించాల‌ని ప‌రిశీల‌కులు పేర్కొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు, ఎన్టీఆర్ జిల్లా.