పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కర్ణాటకలోని ఆవిముక్త దత్త క్షేత్రం ప్రధాన కార్యదర్శి మాచర్ల కేశవమూర్తి అఖిల భారత పద్మ బ్రాహ్మణ పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పద్మశాలి భవన్లో బుధవారం నిర్వహించిన అఖిల భారత పద్మబ్రాహ్మణ పద్మశాలి సంఘం సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడుచే సంఘం జాతీయ కన్వీనర్ వర్కలా సూర్యనారాయణ, గౌరవాధ్యక్షుడు బొజ్జయ్య పంతులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను సంఘ నేతలు ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం మాచర్ల కేశవమూర్తి మాట్లాడుతూ సంఘం బలోపేతంతో పాటు పద్మశాలీల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పుట్టింటివారైన పద్మశాలీలకు టీటీడీలో తగి స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మ బ్రాహ్మణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ తాటిపాముల పుండాలికం, అడెపు హరీష్, మార్కండేయ పీఠం ప్రభులింగస్వామి. అవిముక్త దత్త పీఠం మాత ముక్తాంబికేదేవి, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్