BREAKING
చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ ఎల్లమ్మ ఆలయంలో యక్షగాన ప్రదర్శన.... ఆకట్టుకున్న భక్తులు... ఆలయ సిబ్బంది

విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి

Select Suryaa Now
విభిన్న ప్రతిభావంతులకు ఉచిత భోజనం అందించాలి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన జనార్ధన్ భవన్ (జే బ్లాక్) హాస్టల్ను వారికే కేటాయించి ఉచిత భోజనవసతిని అందించాలని గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వీసీ టాటా నర్సింగరావును కలిసి వినతిపత్రం అందజేశారు. గణితశాస్త్ర విభాగానికి చెందిన పూర్వ విద్యార్థి దివంగత ఎస్ జనార్ధన్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు తమ విరాళంతో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల సౌకర్యార్థం జనార్ధన్ భవన్ను నిర్మించి ఉచితంగా అందించారని తెలిపారు. విశిష్ట ప్రతిభతో గణితశాస్త్రంలో పట్టా పొందిన జనార్ధన్, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను భవిష్యత్తులో ఇతర విద్యార్థులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో తన జ్ఞాపకార్థం అనేక సౌకర్యాలతో హాస్టల్ భవనాన్ని నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం అధికారులు ఈ భవనంలో ఇతర విద్యార్థులకు కూడా వసతి కల్పించడం వల్ల విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి, వారి విద్యాభివృద్ధికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్