BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

*రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్...

Select Suryaa Now
*రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్...

..*

*రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించడానికి జిల్లాలోని 38 ఆసుపత్రుల ఎంపిక*

సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్ 
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించి  వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ (PM RAHAT) పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ  నరసింహా ఐపీఎస్  సూచించారు. జిల్లా పరిదిలో మొత్తం 38  ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు గరిష్ఠంగా ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించడం అత్యంత కీలకమని ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి  అత్యవసర వైద్య చికిత్స అందేలా సహకరించాలని ప్రజలకు సూచించారు. ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని  కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని  అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.