రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నగర పాలక సంస్థ ఎన్నికలలో 58వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజారెడ్డిని ఆదరించి ఓటు వేసి గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్స్ కమిటీ సభ్యులు ఆరణి మధన్ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా బుధవారం మస్తాన్ నాయుడు కాలనీలో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతో మమేకమై రాజారెడ్డిని కార్పొరేటర్ గా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డివిజన్ అభివృద్ధిని అడ్డుకున్నారని, నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎండి ఎక్కువటమే మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో డివిజన్ పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బాబ్జి ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు, దుర్గ, చందన, జీవన్, సుధాకర్, బాలాజీ, హరి, ధరణి ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్