BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

Select Suryaa Now
ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ మేజర్ న్యూస్ : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని.. అయిన‌ప్ప‌టికీ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో అప్రమత్తంగా ఉండాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భ‌ద్ర‌తా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహంతో పాటు ఏదుపాటి రామయ్య (తెదేపా), ముర‌ళీకృష్ణ (ఐఎన్‌సీ), జడగం శ్రీనివాసరావు (జనసేన పార్టీ), సురేష్ (సీపీఎం) త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.