ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి
విజయవాడ మేజర్ న్యూస్ : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న “ఓట్ బచావో–దేశ్ బచావో” ర్యాలీని విజయవంతం చేయాలని ఏఐసీసీ సభ్యుడు, అబ్జర్వర్ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలోని రోహిణిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని, ర్యాలీకి భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రజల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సమావేశంలో రోహిణి డీసీసీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి, సమన్వయకర్త డాక్టర్ పి.కె. మిశ్రా, జగ్‌ప్రవేశ్ కుమార్, జయప్రకాష్ రాణా, వికాష్ షోకీన్, పృథ్వీ సింగ్ రాథోర్, కుమార్ గోపాల్, ధర్మవీర్ యాదవ్‌తో పాటు పీసీసీ, బ్లాక్ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.