సూర్య ఎఫెక్ట్.. అక్రమ మట్టి డంపింగ్‌పై అధికారుల కొరడా.. జేసీబీ, లారీ సీజ్
శామీర్‌పేట, మేజర్ న్యూస్: దేవరయాంజాల్‌లో అక్రమ మట్టి డంపింగ్‌పై సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట డివిజన్ దేవరయాంజాల్ గ్రామంలో మంగళవారం తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా మట్టి డంపింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో గ్రామంలోని సర్వే నంబర్ 676 వద్ద మట్టి పనులకు వినియోగిస్తున్న జేసీబీ, లారీని అధికారులు సీజ్ చేశారు.‘ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మట్టి మాఫియా నయా దందా’ అనే శీర్షికతో మంగళవారం సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో మట్టిని ఇతర అవసరాలకు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు, డంపింగ్, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ మట్టి దందాపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.