వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
సూర్య, నాగిరెడ్డి పేట్,వీధికుక్కల దాడిలో బాలుడికి గాయాలైన ఘటన మండలంలోని అక్కంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన నీల సాత్విక్ అనే నాలుగేళ్ల బాలుడు తమ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబీకులు, స్థానికులు బాలుని గాయపరుస్తున్న కుక్కను చెదరగొట్టారు. బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా మండల, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.