BREAKING
అధికారంలోకి వస్తే 'కృత్రిమ మేధస్సు' అనే పదాన్ని నిషేధిస్తానన్న ట్రంప్ తిరుపతిలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చిత్తూరు శంకర్ న్యాయమూర్తులు, అధికారుల చిరునామాల గోప్యతా చట్టం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి పాడేరు ఏజెన్సీ పరిధిలోని 3 ఘాట్ రోడ్లలో రాకపోకలు బంద్! రామగిరి మండలం లో 10 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కవిత కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు మీ ఇంటి ఆడబిడ్డ లు ఆదరించండి. గెలిపిస్తే అందుబాటులో ఉంటా. షాహిన 39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్ ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా.... జొన్న రొట్టె తింటున్నారా.. మీ ఆహారంలో ఈ సిరిధాన్యాన్ని చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే చైనాలో పేలిన ఏఐ బుడగ? నాలుగు నెలల్లో 40% పతనమైన స్టార్‌50 మా అమ్మను 13 వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించండి.. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం: టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్ కూటమిలో యాదవులకు పెద్దపీట -యాదవులను రబ్బర్ స్టాంప్ లా వాడుకున్న వైసీపీ -నేను యాదవులతో కలిసి పెరిగాను-నాపై అసత్య ప్రచారం దారుణం -14 మంది యాదవులకు కార్పొరేటర్ టికెట్లు ఇచ్చిన ఘనత టిడిపిది -కూటమి అభ్యర్థులను గెలిపించండి: మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సంతానోత్పత్తిలో విటమిన్ డి పాత్ర ఎంత కీలకం.. ఈ లోపం ఉంటే గర్భధారణలో సమస్యలు తప్పవు 19 వ డివిజన్ కార్పొరేటర్ గా ఆనంద్ బాబు యాదవ్ ను గెలిపించుకుందాం.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే విపరీతంగా జుట్టు రాలుతోందా.. ఈ పొరపాట్లు మానుకుంటే హెయిర్ లాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు.. దేవరయాంజాల్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు

Select Suryaa Now
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు.. దేవరయాంజాల్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు

శామీర్‌పేట, మేజర్ న్యూస్ : ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని శామీర్‌పేట తహసీల్దార్‌ చిల్లా శ్రీనివాస్‌ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భానుచందర్‌, దేవరయాంజాల్‌ గ్రామ పంచాయతీ అధికారి రమ మంగళవారం సిబ్బందితో కలిసి మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని శామీర్‌పేట డివిజన్‌ దేవరయాంజాల్‌ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సర్వే నంబర్లు 684, 685లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించి, వాటిని పూర్తిగా తొలగించారు.ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, భూములను ఆక్రమించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే లక్ష్యంగా ఆక్రమణలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.