మా అమ్మను 13 వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిపించండి.. డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం: టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్
తిరుపతి, మేజర్ న్యూస్ :
13వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొట్టే రుక్మిణమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొట్టే రుక్మిణమ్మ కుమారుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్ ఓటర్లను కోరారు.
మంగళవారం ఆయన తన మాతృమూర్తి కొట్టే రుక్మిణమ్మతో కలిసి టిడిపి, బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలతో ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణ నగర్ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కొట్టే హేమంత్ రాయల్ మాట్లాడుతూ... తన తల్లిని గెలిపిస్తే వార్డులోని సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఉన్న హరిజనవాడలో త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపుతామని వారికి హామీ ఇచ్చారు .
ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ముందుండి పరిష్కరించే దిశగా చొరవ చూపుతానని, ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అని ఆయన పేర్కొన్నారు. కావున, నవంబర్ 1వ తేదీన జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలలో 13వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి కొట్టే రుక్మిణమ్మకు 'సైకిల్' గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు భవాని శంకర్,రమేష్ నాయుడు,గంగులయ్య,ప్రవీణ్ కుమార్,రాజశేఖర్,దాముఆచారి,మస్తానీ టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter
Cell no 9705347341