BREAKING
బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన

39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్ ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా....

Select Suryaa Now
39 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న పింకీ జైన్  ... కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శవంతమైన డివిజన్ గా చేస్తా....

తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 39 వ డివిజన్ జనసేన  కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్  ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో కలియతిరిగి ఇంటి ఇంటికి వెళ్లి తనకు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని కోరారు.  మీ ఇంటి ఆడబిడ్డగా, సోదరిగా, ఆదరించి  గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని  కోరారు.
మంగళవారం కార్పొరేషన్ మ కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలను వెంటబెట్టుకుని 39 వ డివిజన్ పరిధిలోని  ఓటర్లను అభ్యర్థించారు.  అనంతరం పింకీ జైన్, దినేష్ జైన్ లు మాట్లాడుతూ 
డివిజన్ పరిధిలోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని  పేర్కొన్నారు.
  మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి నెంబర్ వన్ 
గా జరుగుతోందని చెప్పారు. తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని పేర్కొన్నారు. ఏది ఏమైనా నవంబర్ ఒకటో తేదీ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో 39 వ డివిజన్లో తనకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ఆమె కోరారు. కార్పొరేటర్ గా తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని అపార్ట్మెంట్ వాసులను, డివిజన్ పరిధిలోని ప్రాంతాలలో పర్యటించి ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు దినేష్ జైన్ మధు హేమాద్రి రాము కుమార్ తో పాటు జనసేన, బిజెపి, టిడిపి  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter 

Cell no 9705347341