BREAKING
ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి మార్కాపురంలో జిల్లా ప్రజాప్రతినిధుల కీలక భేటీ మున్సిపల్ చైర్మన్ అభినందించిన జిల్లా ఇన్చార్జి మంత్రి రెబల్ స్టార్ ప్రభాస్‌తో అలాంటి సినిమా చేయాలని ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ చైర్మన్ రష్మిక మందన్న యాసపై నటి మధు ప్రశంసలు.. సౌత్ యాసను దాచుకోకుండా ధైర్యంగా మాట్లాడటంపై అరుదైన స్పందన! జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు.. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరిన యోగి.. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: టి.సి. వరుణ్ 7 ఏళ్లకే 12 భాషల్లో పట్టు.. ఆసిన్ కుమార్తె పెంపకంపై భర్త రాహుల్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! బడి పిల్లలకు శుభవార్త... మహాదేవపూర్ లో ఘనంగా ప్రారంభమైన ఉచిత అల్పాహారం! పాత రుణాలు చెల్లించినా.. మళ్లీ బకాయిల నోటీసులా? సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ మోసంతో ప్రజలను వంచించారు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు భూసిమెట్ట విద్యార్థిని ఎంపిక రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పేదల సొంతింటి కలకు నాణ్యతా లోపాల ముప్పు!

బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం

Select Suryaa Now
బెంగళూరులో ఉద్రిక్తత: సిద్ధరామయ్య నివాసం వైపు బీజేపీ ర్యాలీ భగ్నం

సూర్య నేషనల్ & రీజినల్ బ్యూరో, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ బెంగళూరు నగరంలో సోమవారం బీజేపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన పలువురు కీలక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

భారీగా మోహరించిన పోలీసులు – సీఎం నివాసం ముట్టడికి యత్నం:
బీజేపీ రాష్ట్ర విభాగం పిలుపు మేరకు రాజధాని బెంగళూరులోని మౌర్య సర్కిల్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కావేరి నివాసం ముట్టడికి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆందోళనకారులను బలవంతంగా పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.