BREAKING
జీవనధార ఫౌండేషన్ సేవా కార్యక్రమం ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి - ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి : సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి .టి.విజయ్ కుమార్ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హైమావతి అహన్ పాండే కొత్త చిత్రానికి బెపర్‌వాహ్‌ టైటిల్ ఖరారు.. విడుదల తేదీ ప్రకటన! కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం... గుజ్జుల..! వెల్దుర్తిలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు బాలోత్సవ్ -2026 పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ. బాలీవుడ్ దీపావళి వేడుకల షెడ్యూల్ ఖరారు.. భద్రతా కారణాల రీత్యా కఠిన నిబంధనలు! ప్రేమ్ నగర్ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలి-విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయుడు లేక మూత... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు. నాయికగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటి.. అమల్ నీరద్ బాచ్‌లర్ పార్టీ డ్యూక్స్ చిత్ర పోస్టర్ విడుదల నటి దేవయాని ఇంట మరో సంతోషం.. హీరోయిన్‌గా అడుగుపెడుతున్న కూతురు ప్రియాంక రాజకుమారన్!

ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి

Select Suryaa Now
ఎల్ ని నో ముప్పుతో పొంచి ఉన్న తీవ్ర నీటి ఎద్దడి

లింగాలఘణపూర్ , మేజర్ న్యూస్, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న తీవ్ర వాతావరణ మార్పులు, 'ఎల్ నీనో' ప్రభావం కారణంగా రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తీవ్రమైన తాగు, సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని నెల్లుట్ల గ్రామ ప్రథమ పౌరుడు, సర్పంచ్ నర్సింగ రామకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే గడ్డు పరిస్థితులను, పొడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలందరూ ఇప్పటి నుంచే నీటిని అత్యంత పొదుపుగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశంలో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయని పేర్కొన్నారు. ఊరి పరిధిలోని చెరువులు, కుంటలు, బావులతో పాటు వ్యవసాయ బోర్లు క్రమంగా అడుగంటిపోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో సంక్షోభం మరింత ముదరకుండా ఉండాలంటే ప్రతి పౌరుడూ నీటి సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు సంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలకాలని సర్పంచ్ సూచించారు. అధిక నీటి అవసరమయ్యే వరి వంటి పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) రైతులకు తగిన సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. భూగర్భ జల మట్టాలను తిరిగి పెంచేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రాంగణంలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. "నేడు మనం పొదుపు చేసే ప్రతి నీటి చుక్క మన భావితరాల భవిష్యత్తుకు జీవనాధారం. పంచాయతీ తరఫున చేపట్టే ముందస్తు నీటి సంరక్షణ చర్యలకు గ్రామస్తులందరూ సంపూర్ణ సహకారం అందించాలి" అని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) వినయ్ కుమార్, వార్డు సభ్యులు వేల్పుల శోభారాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, బత్తిని వేణు, గొరిగే సాయిలు పాల్గొన్నారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం అంజమ్మ, ఆశా కార్యకర్తలు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, మాజీ ఉపసర్పంచ్ పెరబోయిన కుమార్, ప్రముఖ గ్రామ రైతులు కొయ్యడ రాంచెంద్రయ్య, శ్రీనివాస్, కుర్రేముల రమేష్, లక్ష్మీనారాయణ, వంగ చంద్రం, గొరిగే సిద్ధార్థ, మల్లయ్య, పెరబోయిన మధుతో పాటు పలువురు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రిపోర్టర్ ;, కార్తీక్, లింగాల ఘనపూర్ జనగామ జిల్లా