BREAKING
ఉక్రేనియన్ దళాల విరుచుకుపడుతున్న దాడి..ఒలేష్కీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను కుటుంబం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం - ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ కోసం మెటా భారీ స్టాక్ ఆఫరింగ్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నిర్మూలనపై అవగాహన ర్యాలీ. కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు వాల్మీకి జయంతి వేడుకల్లో డిఎన్ మూర్తి లండన్ లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ వీధిలో బస్సులు, వాహనాల రాకపోకలపై నిషేధం స్వతంత్ర చైర్మన్ అభ్యర్థి ఆర్.వసంతకుమారి ప్రచారానికి విశేష ఆదరణ...! ఆరోగ్య నెల్లూరే లక్ష్యం.. డివిజన్ల వారీగా పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టీ-షర్టుల బహుకరణ.. కళాకారులను ఆదుకోవాలి - తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ నేతల ముందడుగు ఎన్నికల ప్రచారంలో రోడ్ల నుంచి పాఠశాలల వరకు.. అభివృద్ధే మా అజెండా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కల్లూరు అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం.. 37, 38, 39వ వార్డుల్లో కాటసాని విస్తృత ప్రచారం.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ.

Select Suryaa Now
ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి.. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ.

.సంగారెడ్డి : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, చట్టపరమైన పరిష్కారం అందించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన జిల్లా ఎస్పీ, వారి సమస్యలను ఓపికగా విని ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, చట్టపరమైన పరిష్కారం మరియు సత్వర న్యాయం పొందేందుకు ప్రజావాణి కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఎస్పీ తెలిపారు.