కొడవలూరులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక వైసీపీ నాయకులు
నెల్లూరు, మేజర్ న్యూస్ : స్థానిక ఎన్నికల వేళ కొడవలూరు మండలంలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పెమ్మారెడ్డిపాళెం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ సర్పంచ్ శ్రీ వల్లహాపురం నవీన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో మండలం తెలుగు యువత అధ్యక్షుడు సూర్య ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. నవీన్‌తో పాటు 30 మందికిపైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.