BREAKING
మండలంలో ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవం దేశవాళీ క్రికెట్‌పై భువనేశ్వర్ కుమార్ కీలక ప్రకటన.. ఆ టోర్నీలపైనే పూర్తి ఫోకస్ సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థిగా సింగుపురపు దివ్య రోడ్డు ప్రమాదంలో ఏ ఎస్ ఓ మృతి ఏడుపాయల మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెల కోసం గాలింపు: గెలిచిన నెలలో సమస్యలు పరిష్కరిస్తాను -చింతల చేను ప్రచారంలో రాజారెడ్డి హామీ రైలు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి ఆర్నాబ్' తుఫాన్ బీభత్సం పూతలపట్టులో 13 ఎంపీటీసీ స్థానాలలో 8 ఏకగ్రీవం, 5 స్థానాలకు పోలింగ్ ఓటరు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కార్యాచరణ -"ఓట్ బచావో–దేశ్ బచావో "పై కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష కూటమిలో ఎవరికి వారే! రంజీ ట్రోఫీలో సరాన్ష్ జైన్ రికార్డు బౌలింగ్.. బిహార్‌పై మధ్యప్రదేశ్ ఘన విజయం రగ్బీ పోటీలలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థుల ప్రతిభ కళ్యాణదుర్గం అభివృద్ధి నా ధ్యేయం - మున్సిపల్ అభ్యర్థి బోయ మౌనిక మురళి. ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కోవాలి

కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
కొమురం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆయన 86వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసి నాయకులు పాల్గొని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాంజీ గోండు విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసీ సంప్రదాయాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  కొమురం భీమ్ కేవలం ఆదివాసులతో పాటు మొత్తం జిల్లాకే మంచి మార్గదర్శి అని, ఆయన కోరుకున్న 'జల, జంగల్, జమీన్' సాధన కోసం అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోడు పట్టాలు, రైతు భరోసా, ఐటీడీఏ ఆధ్వర్యంలోని ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ ఫలాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే పిల్లలను బడికి క్రమం తప్పకుండా పంపాలని, మూఢనమ్మకాలకు పోకుండా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉన్నందున నీటి సంరక్షణ అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చి, ఇంకుడు గుంతలు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతుల ద్వారా నీటిని వృథా చేయకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ,  కొమరం భీమ్ ఆశయ సాధనే లక్ష్యంగా జిల్లాలో గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, అధికారులు, గిరిజన నాయకులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ ఫలాలను అర్హులందరికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా బడికి పంపాలని, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సద్వినియోగం చేసుకుని పిల్లలను చదివిస్తే వారు ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదుగుతారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడకుండా వైద్య సేవలందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, రిమ్స్ ఆసుపత్రితో పాటు గిరిజనుల కోసం ప్రత్యేకంగా అనువాదకులను (ట్రాన్స్‌లేటర్స్) సైతం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చిన్నచిన్న సమస్యలను రాయి సెంటర్లు  పోలీస్ స్టేషన్ల ద్వారా అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని సూచించారు. సారా తయారీ, విక్రయాలు, గంజాయి సాగు చట్టరీత్యా నేరమని, గంజాయి పండించినా, రవాణా చేసినా కఠిన శిక్షలు తప్పవని, ఇటీవల కాలంలో కొందరికి జైలు శిక్షలు పడినట్లు ఉదాహరణలతో వివరించారు. కావున ఆదివాసీ యువత చెడు అలవాట్లకు బానిసకాకుండా, గంజాయి సాగుకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మున్సిపల్ చైర్ పర్సన్ అనూష మాట్లాడుతూ, ఆదివాసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే కొమురం భీమ్ కు మనం ఇచ్చే నిజమైన నివాళులు అన్నారు. ప్రతి ఒక్కరు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, ఆదివాసీ నాయకులు రామ్ కిషన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.