రైలు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
కోటబొమ్మాళి, అక్టోబర్ 27, మేజర్ న్యూస్:
సోమవారం తిలారు రైల్వే స్టేషన్లో పూరీ తిరుపతి రైలు నుండి జారిపడి రెండు కాళ్లు పోగొట్టుకొని తీవ్రంగా గాయపడ్డ కోటబొమ్మాళి మండలం వింజంపాడు గ్రామానికి చెందిన హనుమంతు కసవయ్య (70) విశాఖ కే.జీ.హెచ్ లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కసవయ్య కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లేందుకు బయలుదేరి వెళ్లారు. రైల్వేస్టేషన్లో పూరీ తిరుపతి రైలు ఎక్కుతుండగా జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. మృతునికి భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కసవయ్య మృతితో వింజాంపాడు గ్రామంలో విషాదఛాయలు అలుపుకున్నాయి. తీర్థయాత్రలకు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన కసవయ్య విగత జీవుడై రావడం అందరినీ కలచివేసింది.