BREAKING
వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్!

రాష్ట్రం బాగుండడమే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే విజయచంద్ర

Select Suryaa Now
రాష్ట్రం బాగుండడమే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే విజయచంద్ర

 

పార్వతీపురం, అక్టోబర్ 27, మేజర్ న్యూస్ :
రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ కూటమి అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిని ఎమ్మెల్యే పరిచయం చేశారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఆయన అన్నారు.తెదేపా, జనసేన, భారతీయ జనతా పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారన్నారు. నియోజకవర్గంలో కూటమి ధర్మం ఖచ్చితంగా అమలైందని, ఈ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే వివరించారు.పార్వతీపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించారని, అభ్యర్థిగా ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఉన్నారని తెలిపారు. బలిజిపేట స్థానాన్ని జనసేనకు కేటాయించారని, అక్కడ అభ్యర్థి పాలూరు చాందిని పోటీలో నిలబడ్డారని వివరించారు. సీతానగరం స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారని, అక్కడ అభ్యర్థిగా కంకణాపల్లి అనురాధ పోటీలో ఉన్నారని తెలిపారు. అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తపై ఉందని, కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.