రోడ్డు ప్రమాదంలో ఏ ఎస్ ఓ మృతి
ఆమదాలవలస, అక్టోబర్ 27, మేజర్ న్యూస్ ఆమదాలవలస- శ్రీకాకుళం రోడ్డులో నందగిరిపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రెవిన్యూ కార్యాలయం అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏ ఎస్ ఓ) శేఖర్ బాబు (45) మృతి చెందారు. తుఫాను విధి నిర్వహణలో భాగంగా ముద్దాడిపేట నాగావళి ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు బైక్ పై వెళ్లే సమయంలో వర్షం పడుతుండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించే తరుణంలో డివైడర్ ను డీకొట్టారు. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఈయన రెండేళ్ల క్రితం ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో ఏఎస్ఓగా విధులు చేపట్టారు. ఈయన మృతిపై రెవిన్యూ యంత్రాంగం అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ తరలించారు. శ్రీకాకుళం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.