రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి*
*•అధికారులకు అదనపు కలెక్టర్ వెంకారెడ్డి ఆదేశం*
*యాదాద్రి భువనగిరి,ప్రతినిధి మేజర్ న్యూస్*
జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లాలో రీ-సర్వే పురోగతి, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ సమస్యలపై సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా రీ-సర్వేను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. భూ భారతి కింద అందిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో రోజువారీ పురోగతిపై నివేదికలు సమర్పించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ,ఆర్డీవోలు,తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.