ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : గెలిచిన నెల రోజుల్లో డివిజన్ పరిధిలోని ప్రతి సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తానని జనసేన నగర అధ్యక్షులు, 58వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి రాజారెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చింతల చేను డివిజన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు యువత, డ్రైన్లు, రోడ్లు, కాలువలు, దోమలు సమస్యతోపాటు అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే టిడిఆర్ బాండ్లు సమస్యను భూమి కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తూ వారికి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్ కు సైకిల్ గుర్తుపై, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిబద్ధతతో పనిచేసి డివిజన్లోని ప్రతి సమస్యను పరిష్కరించి, ప్రజల ఆధర అభిమానాలు పొందేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కూటమి నాయకులు నవీన్, పురుషోత్తం, హేమంత్, దుర్గా, చందన, రమేష్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.