BREAKING
కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్

తుర్కపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్

Select Suryaa Now
తుర్కపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్

శామీర్‌పేట, మేజర్ న్యూస్: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, గర్భిణుల సంక్షేమం, పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని తుర్కపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు, ఇతర సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న ఆహార మెనూను తనిఖీ చేశారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణను పరిశీలించడంతో పాటు చిన్నారులకు ఆహారంలో భాగంగా అందించే కూరగాయలు, పప్పులు, గుడ్ల నిల్వలను తనిఖీ చేశారు. ఆహార సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం గర్భిణులకు అందుతున్న పోషకాహార సహాయం, వైద్య సేవలు, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. గర్భిణులకు అవసరమైన పోషకాహారాన్ని సకాలంలో అందించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని డాక్టర్ కె. ఆనంద్ పేర్కొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార, ఆరోగ్య సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.