BREAKING
కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్

సర్పంచ్ పెరుక సరిత- రామచంద్రo ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, షూస్, డైరీలు, డిక్షనరీలను అందజేశారు

Select Suryaa Now
సర్పంచ్ పెరుక సరిత- రామచంద్రo ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, షూస్, డైరీలు, డిక్షనరీలను అందజేశారు

కోహెడ ; కోహెడ మండలంలోని టీజీ మోడల్ స్కూల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పీఎం శ్రీ టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ రవీందర్ అన్నారు. మండలంలోని నాగసముద్రాల గ్రామంలోని పీఎం శ్రీ టీజీ మోడల్ స్కూల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న స్కూల్ బ్యాగులు, షూస్, డైరీలు, డిక్షనరీలను గ్రామ సర్పంచ్ పెరుక సరిత- రామచంద్రంతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల విద్య బలోపేతానికి ఉచితంగా టిఫిన్, మధ్యాహ్న భోజనం తోపాటు విద్యార్థులకు అవసరమైన బ్యాగులు, షూస్ వంటి ఉపయోగకరమైన వస్తువులు అందజేయడం ఎంతో సంతోషకరమన్నారు. విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సర్పంచ్ పెరుక సరిత - రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, సూపర్ ఎల్ నినో ప్రభావం ఉన్నందున నీటిని, విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఏపి చైర్మెన్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.