BREAKING
ఘనంగా మహర్షి వాల్మీఖి జయంతి జలదంకి మండలం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డికి బోయిలచిరువెళ్ల నాయకుల మద్దతు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం నవంబర్ 16 వరకు సాధారణ ఫీజు చెల్లింపునకు అవకాశం: జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ అయోధ్యలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణానికి భూమి పూజ తాత, తండ్రి వారసత్వం - ఆత్మకూరు అభివృద్ధిలక్ష్యం - తల్లితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన యువ నేత తారక్ రెడ్డి దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన తెదేపా అభ్యర్థులు. ఉత్సాహంగా విక్రమసింహపురి వర్సిటీ కావలి జోన్ క్రికెట్ టోర్నీ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' మూవీలోకి లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంట్రీ.. ఆసక్తికరమైన పోస్టర్ విడుదల ప్రజల ప్రాణాల కోసం పోరాడిన చేతులు.. నేడు న్యాయం కోసం నినదిస్తున్నాయి.కోవిడ్ సేవలు మరువొద్దు.. NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి. డా. బాలకృష్ణ_ ఇంకొల్లులో 11 నామినేషన్లు ఉపసంహరణ వైభవంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు రాహుల్ విజయ్ 'అ' (AH) సినిమా విడుదల తేదీ మార్పు.. నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్ ఏపీ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా విశ్రాంత జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

*రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి*

Select Suryaa Now
 *రైలు ఢీ-కొని మధిర లో విధులు నిర్వహిస్తున్న రైల్వే సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ మృతి*

మధిర, సూర్య మేజర్ న్యూస్.

ఆదివారం రాత్రి  08:25 గంటలకు మధిర రైల్వే స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మద్దకూరి శివరామ బ్రహ్మం (44), తండ్రి రంగయ్య దొర, కులం కాపు, వృత్తి :సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. యూరాల్లోకెళ్తే విధి నిర్వహణ నిమిత్తం మధిర రైల్వే స్టేషన్ నుండి డౌన్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో గంటకు సుమారు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రైలు నంబర్ 20806 ఏపీ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు రైలే పోలీసులు తెలియజేశారు.
ఈ ఘటనపై మధిర స్టేషన్ మాస్టర్ ఖమ్మం స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించగా, వారి ద్వారా అందిన సమాచారం మేరకు ఖమ్మం జీఆర్పీ పోలీస్ స్టేషన్‌ ఎస్ఐ సీహెచ్. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వారి ఆదేశాల మేరకు ఏ. సత్యనారాయణ రెడ్డి,  ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మృతుడి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.