ఘనంగా మహర్షి వాల్మీఖి జయంతి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు ఉప రవాణా శాఖ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎం వి ఐ రాములు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆయన చేసిన రచనలు భారత దేశవ్యాప్తంగా వాల్మీకి రామాయణం విశిష్టత గురించి రాములు వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది, పలువురు వాహనకారులు తదితరులు పాల్గొన్నారు.