BREAKING
ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్

చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.

Select Suryaa Now
చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.

చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. 
ఎండిపోతున్న పంటలను పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
చేర్యాల : ఎల్ ని నో ప్రభావం వల్ల సరైన వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునే పరిస్థితి లేనందున చేర్యాల మండలాన్ని వెంటనే కరువు మండలం గా ప్రకటించాలని అనావృష్టితో కొట్టుమిట్టాడుతూ మండల వ్యాప్తంగా పంటలను సంబంధిత అధికారులు పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం చేర్యాల మండల అధ్యక్ష, కార్యదర్శులు బోడిగం నర్సిరెడ్డి, నాగపురి కనకయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున చేర్యాల రైతు వేదికలో  ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజావాణి అధికారులకు రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం అందించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి నాగపురి కనకయ్య మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం కొద్దిపాటి  వర్షాలకు రైతులు పంటలను విత్తుకోవడం పంటలు పూత, కాతా దశకు వచ్చేవరకు సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం నమోద యి నందున ప్రస్తుతము నెల రోజుల నుండి వర్షాలు  రాకపోవడం వల్ల చుక్కనీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని వరి ,పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటల దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయని, పంటల సాగుకు రైతులు  పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యారని ఈ రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వర్షాభావానికి తోడు కరెంటు కోతలు పెరిగిపోయి నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందడం లేదని దీనివల్ల మోటార్లు కాలిపోతూ నష్టపోతున్నారని ఎల్ నీ నో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయని రాబోయే రోజుల్లో త్రాగునీటికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితిలో మండలంలో ఉన్నాయని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అధికారులు వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసి చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం టౌన్ కార్యదర్శి తుప్పతిరాజు, రైతు సంఘం మండల నాయకులు నంగి మైసయ్య తదితరులు పాల్గొన్నారు.