రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో బహిరంగ వేలం
పటాన్‌చెరు; ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో సోమవారం ఈవో లావణ్య,ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీల్డ్ టెండర్, బహిరంగ వేలం ద్వారా రూ.17.10 లక్షల ఆదాయం సమకూరింది. హోమం, పూజా సామగ్రి, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్ల విక్రయ హక్కులను శేఖర్ రూ.9.85 లక్షలకు, పూలు, పూలదండల వేలం హక్కులను శ్రీనివాస్ రూ.7.25 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరికాయల దుకాణం, కొబ్బరి చిప్పల సేకరణకు తగిన సంఖ్యలో టెండర్‌దారులు పాల్గొనకపోవడంతో వాటి టెండర్లను రద్దు చేసినట్లు ఈవో లావణ్య తెలిపారు. తిరిగి నిర్వహించే టెండర్ల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఇస్నాపూర్ సీఐ మహేష్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.