14 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ కాపీలు అందజేత
సంగారెడ్డి;సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు జావేద్ అలీ ఆదేశాల మేరకు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సంధిల బలరాం ఆధ్వర్యంలో ప్రొబేషన్ డిక్లేర్ అయిన 14 మంది పంచాయతీ కార్యదర్శులకు ఆర్డర్ కాపీలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరం అధ్యక్షులు జగన్‌తో పాటు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మిగిలిన పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ కాపీలను కూడా త్వరలో అందించేందుకు కృషి చేస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు.పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం నిరంతరం కృషి చేస్తాయని వారు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.