69వ డివిజన్లో SDPI దూకుడు
నెల్లూరు, మేజర్ న్యూస్ : రంగనాయకులపేట 69వ వార్డులో మైనార్టీ ఓట్లే లక్ష్యంగా దూసుకుపోతున్న ఎస్డీపీఐ అభ్యర్థి షేక్ అబ్దుల్ అజీజ్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రంగనాయకులపేట 69వ వార్డులో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అజీజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా తన ఎన్నికల గుర్తు బీరువా పై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎస్డీపీఐ బలపరిచిన అభ్యర్థి అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ను కూడా ప్రజలకు పరిచయం చేస్తూ, ఆయన ఎన్నికల గుర్తు కుట్టు మిషన్ పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.