ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నీ వీడి తెదేపాలో 50 కుటుంబాలు చేరిక
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో సోమవారం
మండలం లోని నల్లగట్ల గ్రామంలో వైసీపీకి చెందిన అనుముల లక్ష్మీపతి, బద్రి భాస్కర్, బద్రి రామలింగయ్య, అరటి రవి, బోయ రామకృష్ణ, దండు భాస్కర్‌లతో పాటు మరో 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.వారందరికీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. గతంలో భూమా నాగిరెడ్డి తో కలిసి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ తమ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.భూమా కుటుంబానికి రాజకీయాల కంటే ప్రజలతో ఉండే అనుబంధమే ముఖ్యమని, గతంలో భూమా నాగిరెడ్డి కార్యకర్తలను ఏ విధంగా ఆప్యాయంగా చూసుకున్నారో, అదే ఆప్యాయత, ఆదరణ తమ దగ్గర కూడా ఉంటాయని హామీ ఇచ్చారు.టీడీపీలోకి వచ్చిన వారిని కొత్తవారిగా కాకుండా తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తామని, పాతవారు, కొత్తవారు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భూమా కుటుంబంపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ చేరికలకు ప్రధాన కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పదవులు, హోదాలు ఆశించకుండా తమ గ్రామానికి రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నాయకులు తమ వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు.ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడమే తమ ప్రాధాన్యమని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయబోమని తెలిపారు.
నల్లగట్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
నల్లగట్ల గ్రామంలో ఇప్పటికే సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మూడో విడతలో మరో రూ.20 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.భవిష్యత్తులో గ్రామానికి అవసరమైన రోడ్లు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
వైసీపీ పాలనపై విమర్శలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల పనితీరును బేరీజు వేసుకోవాలని భూమా అఖిలప్రియ అన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా