BREAKING
గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ రైతుల అభ్యున్నతే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం అంగన్‌వాడిలో ఏడుగురే.. హాజరులో 14మంది - తనిఖీలో వెలుగుచూసిన వ్యత్యాసం హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలాల్ నరసింహ గౌడ్ ఎన్నిక IND vs NZ: భారత్ A తరఫున జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ.. రిషభ్ పంత్ ఫిట్‌నెస్ టెస్ట్! దుద్యాల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనన్ రామగిరి ఖిల్లాలో 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా ఘనంగా "చంద్రయాన్" సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్ అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..! ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్ దోమడుగు శివారులో రోడ్డు ప్రమాదం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా...? ఆదర్శవంతమైన డివిజన్ లక్ష్యంగా కృషి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్ ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలి ... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

అక్రమ ఇసుక నిలువలు సీజ్

Select Suryaa Now
అక్రమ ఇసుక నిలువలు సీజ్

పాపన్నపేట;మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి గ్రామ పరిధిలోగల ఏడుపాయలలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని మూడు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిల్వ చేసిన 19 ట్రాక్టర్ల ఇసుకను సోమవారం సీజ్ చేసినట్లు పాపన్నపేట తహసీల్దార్ సతీష్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. మండలంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో నాగ్సాన్‌పల్లిలో ఇసుక నిల్వలను గుర్తించినట్లు వెల్లడించారు. వాటిపై విచారణ చేపట్టగా, సంబంధిత అనుమతులు లేకుండానే ఇసుకను నిల్వ ఉంచినట్లు గుర్తించామని తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటూ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.ఈ తనిఖీలు మండల గిర్దావర్ శరత్, నాగ్సాన్‌పల్లి గ్రామ జీపీఓ భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు ఏర్పాటు చేసినా, అనుమతులు లేకుండా ఇసుకను తరలించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.ముఖ్యంగా మంజీరా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సతీష్ కుమార్ హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిరంతరం నిఘా ఉంచుతామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.