BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలి ... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

Select Suryaa Now
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలి ...  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
 సూర్య కరీంనగర్ ప్రతినిధి ;;ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్‌ పురోగతిని సమీక్షించారు. కరీంనగర్‌ జిల్లా నుంచి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి చిత్ర మిశ్రా పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 4.50 లక్షల పనులను మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణను గడువులోగా ముగించాలని సుదర్శన్‌ రెడ్డి సూచించారు. ఓటర్ల పేర్ల చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలను భౌతికంగా, ఆన్‌లైన్‌లో భద్రపరచాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించగా, వాటిలో 44 వేల దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలిపారు. ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిశీలనతో పాటు పెండింగ్‌ పనులను నవంబర్‌ 5వ తేదీలోగా పరిష్కరించాలని ఆదేశించారు.
 
హుజూరాబాద్‌పై ప్రత్యేక దృష్టి....
 
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో 202 లాజికల్‌ వ్యత్యాసాలు, మ్యాపింగ్‌ లేని 243 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో అర్హత లేని ఓటర్లకు సంబంధించిన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ చిత్ర మిశ్రా సూచించారు. ప్రతి కేసును ఈఆర్‌ఓ స్వయంగా పునఃపరిశీలించి, అనర్హతకు సంబంధించి స్పష్టమైన ఆధారాలతో కూడిన ఉత్తర్వులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏడు రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫారం-6 దరఖాస్తులు 2,403, ఫారం-8 దరఖాస్తులు 1,440 ఉన్నందున, వాటిని ఏఈఆర్‌ఓల వారీగా విభజించి ఆలస్యానికి గల కారణాలను సమీక్షించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ వారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించనున్న సమావేశంలో స్వీకరించిన దరఖాస్తులు, వాటి రసీదుల వివరాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు.