ఆదర్శవంతమైన డివిజన్ లక్ష్యంగా కృషి -53వ డివిజన్ ప్రచారంలో శంకర్ యాదవ్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తనకు కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే 53వ డివిజన్ ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తన ప్రచారాన్ని మరింత జోరు పెంచారు. కూటమి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, జగన్నాథం, నాయిడమ్మ, పి లోకేష్ నాయుడుతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ ఒకటో తేదీ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, శంకర్ యాదవ్ అనే తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారతీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ 53వ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వీధి దీపాలతో పాటు సిసి రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ అభివృద్ధి కాలువలు పారిశుధ్య నిర్వహణ దోమల నివారణకు పటిష్ట చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి కాలనీలో నెలకు ఒకసారి ప్రజా సమస్యల పరిష్కార సమావేశాలు నిర్వహించి, సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలు తనపై విశ్వాసం ఉంచి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కుటమి నాయకులు సుజాత, కిరణ్, సుబ్బు, రమేష్, జనసేన వార్డు ఇన్చార్జి కిరణ్ చౌదరి, దినేష్, ప్రవీణ్ యువరాజ్, తులసి, మహిళలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్