BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
సూర్య-గోదావరిఖని:విద్యార్థులు అపరిచితుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ రామగిరి స్వారిక సూచించారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల పిలుపు మేరకు ‘సురక్షిత్‌–బచపన్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మార్కండేయ కాలనీలోని నారాయణ విద్యాసంస్థలో నిర్వహించిన పోక్సో చట్ట అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంట్లోనైనా, బయటైనా మనుషుల రూపంలో ఉన్న దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుడ్ టచ్‌, బ్యాడ్ టచ్‌పై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని, తమకు అసౌకర్యం కలిగించే ప్రవర్తనను గుర్తించి వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని చెప్పారు. విద్యాసంస్థల్లో, బయట బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా రీల్స్‌కు అనవసరంగా అలవాటు పడకుండా, వాటిని జాగ్రత్తగా వినియోగించాలని అన్నారు. పిల్లల భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా పెద్దల సహాయం తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు, న్యాయవాదులు చందాల శైలజ, ఎండీ.ఉమర్, రాజ్యలక్ష్మి, వన్‌టౌన్ మహిళా ఎస్‌ఐ కె.అనూష, కోర్టు సూపరింటెండెంట్ అసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.