telangana
దుద్యాల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా
దుద్యాల, మేజర్ న్యూస్: దుద్యాల్ గేట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనన్ సోమవారం సాయంత్రం పరిశీలించాడు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించాడు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిటిసి డిఎస్పి శ్రీనివాస్, పరిగి డిఎస్పి శ్రీనివాసులు, కొడంగల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, మోమిన్ పెట్ సీఐ వెంకట్, దుద్యాల ఎస్సై శ్రీశైలం తదితరులు ఉన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.