BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్

Select Suryaa Now
ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ;;సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 30 లక్షల సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన అత్యాధునిక వైద్య పరికరాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.​ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి భారీగా ఖర్చు పెట్టుకోలేని పేద, మధ్యతరగతి రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం లభించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ నిధులను సమకూర్చారు. ఈ పరికరాల రాకతో అత్యవసర చికిత్సలు, రోగ నిర్ధారణ సేవలు మరింత సులభతరం కానున్నాయి.

​- మౌలిక వసతుల పరిరక్షణే ముఖ్యం

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల ఆసుపత్రిలో మౌలిక వసతులు, ఆధునిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆసుపత్రుల నిర్వహణ, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.​స్థానిక ప్రజల ఆరోగ్యం, ఆసుపత్రి అవసరాలను గుర్తించి 30 లక్షల విలువైన పరికరాలను అందుబాటులోకి తేవడంపై రోగులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది వీటిని సద్వినియోగం చేసుకుంటూ రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.