BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ

Select Suryaa Now
గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:గ్రామీణ సమస్యలు, వ్యవసాయ వనరులపై అవగాహన పెంపొందించుకునేందుకు అనురాగ్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఎదులాబాద్‌లో పీఆర్ఏ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా రైతులు, మహిళలతో మాట్లాడి స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను తెలుసుకున్నారు.
గ్రామ పటం, వనరుల పటం, పై చార్ట్‌, సమస్యల వృక్షం వంటి పద్ధతులతో గ్రామంలోని మౌలిక సదుపాయాలు, వ్యవసాయ వనరులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహనతో పాటు గ్రామీణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపై స్పష్టత కలిగింది. కార్యక్రమంలో సానియా, సమీరా, స్నేహ, శ్వేత, ఉజ్వల్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.