telangana
హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలాల్ నరసింహ గౌడ్ ఎన్నిక
దుద్యాల్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కలాల నరసింహ గౌడ్ ఎన్నికయ్యారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నివాసంలో మండల నాయకుల సమక్షంలో ఆయనను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు నరసింహ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాపై ఎంతో నమ్మకంతో పదవి కట్టబెట్టిందని పార్టీ బలోపేతానికి మరింత పట్టుదలతో పని చేస్తానని చెప్పాడు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.