జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
సూర్య, జన్నారం : దేశ రక్షణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ సోమవారం రాత్రి జన్నారం మండల కేంద్రంలో స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీ ధర్మారం చౌరస్తా నుంచి ప్రారంభమై తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పోలీసుల త్యాగాలు మరువలేనివంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర నందు నాయక్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కుదిరె వెంకన్న, పొనకల్ ఉపసర్పంచ్ అప్పల జలపతి, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఫసియుల్లా, మహమ్మద్ రియాజుద్దీన్, మోసిన్ షా ఖాన్, అలాగే పిల్లి మల్లయ్య, జాజాల శ్రీకాంత్, మగ్గిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.