BREAKING
వైసీపీకి క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్ల మద్దతు. 33వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఉషారాణి ప్రకాష్ విస్తృత ప్రచారం ఎల్లంపేట అభివృద్ధే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ మహిళా హత్య కేసును చేదించిన జిన్నారం పోలీసులు సురక్షిత బాల్యం ప్రతి ఒక్కరి బాధ్యత సంగారెడ్డి జిల్లాలో పాఠశాలల్లో బాలల హక్కులు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తులు పూడూరు–మేడ్చల్ మధ్య జోరుగా అక్రమ మట్టి దందా 28వ వార్డులో వైసీపీ అభ్యర్థి పెదబాబు ప్రచార జోరు..:గతంలో చేసిన అభివృద్ధే గెలుపునకు బాట వేస్తుందన్న ధీమా… 'అర్నాబ్ 'తుఫాను సహాయక కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచెయ్యాలి --తుఫాన్ పరిస్థితి, సహాయక చర్యలుపై వర్చువల్ గా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి బెస్తరపల్లి లో జోరుగా వైసీపీ ప్రచారం. స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ కార్యక్రమం మూడు జిల్లాల నుంచి పాల్గొన్న శిక్షణార్థులు అర్హత లేని వైద్యులు, అక్రమ క్లినిక్‌లపై కఠిన చర్యలు: మేడ్చల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు - జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సానుకూలత పార్టీ ప్రచార ఖర్చులు ఎన్నికల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో వేయరాదు ఈ నెల 27న ఖేలో ఇండియా వాలీబాల్ సెలక్షన్స్ అండర్-17 బాలబాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎంపికలు

ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం

Select Suryaa Now
ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం
 సూర్య తిమ్మాపూర్  ;;విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే శ్రీ చైతన్య కళాశాల లక్ష్యమని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ లోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఫాం బి ,ఫాం డి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మసీ కోర్సు ప్రాముఖ్యత, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, కళాశాలలో ఉన్న ల్యాబ్ , లైబ్రరీ సౌకర్యాలు, క్రమశిక్షణ నియమాల వివరించారు. ఫార్మసీ విద్య  ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యత అని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. తమ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీచైతన్య విద్యార్థులు చైతన్య వంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరెందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ రామ నర్సింహ రెడ్డి, హెచ్ఓడి డాక్టర్ రవిందర్ రెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, మిడియా కో ఆర్డినేటర్ గొంటి రమేష్, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.