BREAKING
జడ్పిటిసి బిఫారం అందజేసిన రెడ్డి శాంతి. దోసకాయలపల్లిలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన శ్రేణులు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్: నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ! చంద్రగిరి నియోజక వర్గంలో 142 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామి నేషన్లు తిరస్కరణ -ఒక న్యాయవాదిగా అభ్యర్థుల తరపున వెళ్లిన చెవిరెడ్డి పినపళ్లలో టీడీపీ జోరు... వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు... 7, 8, 9 వార్డుల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారం పశు వైద్యశాల నూతన భవనానికి రూ.30 లక్షల అంచనాలు సిద్ధం. ​ఆర్ఐఎన్ఎల్‌లో ఘనంగా విజిలెన్స్ వారోత్సవాలు ​ఉద్యోగుల చేత 'సమగ్రతా ప్రతిజ్ఞ' ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం - పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం మీ ఇంటి ఆడబిడ్డ గా పింకీ జైన్ ను ఆదరించి గెలిపించండి.... మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం ఆర్.సి.యం చర్చి వార్షికోత్సవ శుభాకాంక్షలు - ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

28వ వార్డులో వైసీపీ అభ్యర్థి పెదబాబు ప్రచార జోరు..:గతంలో చేసిన అభివృద్ధే గెలుపునకు బాట వేస్తుందన్న ధీమా…

Select Suryaa Now
28వ వార్డులో వైసీపీ అభ్యర్థి పెదబాబు ప్రచార జోరు..:గతంలో చేసిన అభివృద్ధే గెలుపునకు బాట వేస్తుందన్న ధీమా…

అమలాపురం మేజర్ న్యూస్  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి (పెదబాబు) ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు.
గతంలో 24వ వార్డుగా ఉన్న ప్రాంతం ప్రస్తుతం 28వ వార్డుగా మారిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ ఈసారి కూడా తనకు అవకాశం కల్పించాలని పెదబాబు వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆయన ప్రచారంలో వివరిస్తున్నారు.చిట్టూరి పెదబాబు స్నేహశీలి, దాతృత్వ గుణం కలిగిన వ్యక్తిగా, సౌమ్య స్వభావం ఉన్న నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ప్రజలతో ఉన్న పరిచయాలు, గతంలో చేసిన పనులు తనకు ఎన్నికల్లో కలిసివస్తాయని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో 28వ వార్డులో మూడోసారి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యే అవకాశం పెదబాబుకు ఉందని కొందరు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తుది ఫలితం ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను,ఛైర్పర్సన్ అభ్యర్ధిని విరితా దేవిని గెలిపించాలని చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి (పెదబాబు) వార్డు ప్రజలను కోరుతున్నారు.