పట్టణంలో కొత్తపల్లి ఇంటింటి ప్రచారం
నరసాపురం, మేజర్ న్యూస్:మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ సోమవారం పలు వార్డులలో విస్తృతంగా పర్యటించారు. కూటమి చైర్పర్సన్ అభ్యర్థి కొత్తపల్లి శైలజ, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 32వ వార్డులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో రాష్ట్రం పురాభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలో ఉందని, స్థానిక సంస్థలలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సెక్రటరీ, మాజీ ఎంపీపీ బాలం ప్రతాప్ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.