BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం

Select Suryaa Now
ఇన్ఫోసిస్‌ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. కలెక్టర్‌ మను చౌదరి ఆదేశం

ఘట్‌కేసర్‌ రూరల్, మేజర్ న్యూస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పరిధిలోని పోచారంలో ఈ నెల 30న ఇన్ఫోసిస్‌ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ మను చౌదరి అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన విజయవంతంగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఇన్ఫోసిస్‌ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్‌ హెలిప్యాడ్‌ నిర్మాణం, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో రానున్నందున హెలిప్యాడ్‌ నిర్మాణంలో నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై ఇన్ఫోసిస్‌ ప్రతినిధులతో చర్చించారు.కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ సదుపాయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, సీఎం పర్యటన సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కీసర ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, జిల్లా ఆర్‌అండ్‌బీ ఈఈ జలంధర్‌, ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.